ఇంగ్లాడ్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంజన్ ప్లాంట్!

Ratan Tata
టాటా గ్రూపు సంస్థల సారధి రతన్ టాటాకు చెందిన ఆటోమొబైల్ విభాగం టాటా మోటార్స్‌ బ్రిటీష్ యూనిట్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ప్రాంతంలో ఓ కొత్త ఇంజన్ ప్లాంటును నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం కంపెనీ 400 మిలియన్ల పౌండ్లను పెట్టుబడిగా వెచ్చించనుందని, ఇందుకు బ్రిటీష్ ప్రభుత్వం కూడా 10 మిలియన్ పౌండ్ల మద్దతును ప్రకటించనుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక సండే టెలిగ్రాఫ్ ప్రచురించింది.

జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ ద్వారా 2,000 లకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడగలవని సదరు పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం జేఎల్ఆర్‌కు ఎలాంటి ఇంజన్ ప్లాంట్లు లేవు, జేఎల్ఆర్‌కు కావాల్సిన ఇంజన్‌లను మాజీ యజమాని అయిన ఫోర్డ్ సరఫరా చేస్తుంది. ఈ ప్లాంటు ఏర్పాటును రెండేళ్లలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో కూడా ఈ తరహా ప్లాంట్ ఏర్పాటు చేయాలని జేఎల్‌ఆర్ యోచిస్తున్నట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2011, 15:55 [IST]
English summary
Tata Motors, the Indian auto giant which owns the Jaguar and Land Rover car brands has announced it will be building a new engine plant in England's West Mid Lands. The new engine plant will require an investment of £400 million. The British Government has also offered assistance of £10 million.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+