రేంజ్ రోవర్ ఎవోక్ ఉత్పత్తిని ప్రారంభించిన జేఎల్ఆర్

Range Rover Evoque
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆఫర్ చేస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) రేంజ్ రోవర్ ఎవోక్ ఉత్పత్తిని బ్రిటన్‌లోని హాలేవుడ్ ప్లాంటులో ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ మోడల్‌కు ఇప్పటికే 18,000 అడ్వాన్స్ బుకింగ్‌లు వచ్చయాని, హాలేవుడ్‌లోని ల్యాండ్ రోవర్ ప్లాంటులో రేంజ్ రోవర్ ఎవోక్ ఉత్పత్తిని ప్రారంభించడం ఓ ముఖ్యమైన మైలురాయి అని జేఎల్ఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌కు ప్రంపచ మార్కెట్ల నుంచి వస్తున్న భారీ స్పందను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరలో ఈ మోడల్‌ను డెలివరీ చేసేందుకు కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను కూడా రెండింతలకు (3,000 మంది ఉద్యోగులకు పైగా) పెంచింది. ఈ మోడల్ మొత్తం ఉత్పత్తిలో 75 శాతం ఉత్పత్తి 170 దేశాలకు పైగా ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతుల ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు రెండు కోట్ల పౌండ్ల ఆదాయం వచ్చి చేరుతుంది. కాగా.. ఈ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి రావచ్చుననే కథనాలు వినపడుతున్నాయి. ఒక్క రేంజ్ రోవర్ ఎవోక్ మాత్రమే కాకుండా జేఎల్ఆర్ అందిస్తున్న అన్ని మోడళ్లను కూడా భారత్‌కు తీసుకురావాలని టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 5, 2011, 13:09 [IST]
English summary
Tata Motor's Britain unit Jaguar Land Rover said it has started production of its sports utility vehicle Range Rover Evoque at Land Rover's Halewood facility in the UK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+