150 కేజీల పల్సర్ బైక్‌ను గాల్లోకి ఎత్తిన జాన్ అబ్రహాం!

John Abraham Stunt in Force
బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం నటిస్తున్న తాజా చిత్రం 'ఫోర్స్' (తెలుగులో వచ్చిన ఘర్షణ చిత్రానికి రీమేక్)లో మన హీరో దాదాపు 150 కేజీలకు పైగా బరువుండే ఓ పల్సర్ బైక్‌ను అమాంతం గాల్లోకి లేపి గిరా గిరా తిప్పేసి విసిరేశాడట. సాధారణంగా జాన్ అబ్రహాంకు మోటార్‌బైక్‌లంటే యమ క్రేజ్. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సన్నివేశంలో జాన్ 150 కేజీల బరువుండే పల్సర్ బైక్‌ను పైకిలేపి విసిరేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ సన్నివేశాన్ని ఎలాంటి డూప్ లేకుండా జాన్ అబ్రహాం స్వతహాగా చేయాలని నిర్ణయించుకున్నాడని, ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు తాను సెట్‌లో లేనని ఫోర్స్ చిత్ర నిర్మాత విపుల షా తెలిపారు. అంతేకాదండోయ్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఈ బైక్‌కు ఎలాంటి తాళ్ల(రోప్స్)ను కూడా కట్టొద్దని జాన్ చెప్పినట్లు షా అన్నారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చాలా టేక్‌లు పట్టయాని, జాన్ ఎంతో శ్రమించి ఈ భారీ స్టంట్‌ను పూర్తి చేశాడని విపుల్ షా తెలిపారు.

వాస్తవానికి జాన్ కండల వీరుడే అయినప్పటికీ.. 100 కేజీల బరువున్న అమ్మాయిని అయితే ఎత్తుకోగలం కానీ.. 150 కేజీల బరువున్న బైక్‌ను గాల్లో గిరా గిరా తిప్పడమేంటని విమర్శకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి విడుదలైన ఫోటోలో కూడా జాన్ బైక్‌ను పైకెత్తినట్లుగా తెలుస్తోంది కానీ, బైక్‌కు తాళ్లు ఉన్నాయా లేవా అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఒకవేళ జాన్ నిజంగా ఈ స్టంట్ చేసి ఉంటే.. ఇతడిని ఒలంపిక్ గేమ్స్‌కు పంపించవచ్చని సినీ జనం సెటైర్‌లు వేసుకుంటున్నారు.

తమిళంలో సూర్య-జ్యోతిక నటించి 'కాక్కా కాక్కా' చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, అసిన్‌ల కాంబినేషన్‌లో 'ఘర్షణ' పేరుతో రీమేక్ చేశారు. కాగా.. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో 'ఫోర్స్' పేరుతో జాన్ అబ్రహామ్ మరియు జెనీలియాల కాంబినేషన్‌లో రీమేక్ చేస్తున్నారు. మరి ఇది రియల్ స్టంట్ లేకా సినిమా పబ్లిసిటీలో భాగమా అనేది తేలాల్సి ఉంది. ఇక పల్సర్ బైక్ విషయానికి వస్తే.. భారత్‌లో ఉన్న ఏ జపనీస్ స్పోర్ట్స్ బైక్‌ను తీసుకున్నా సదరు మోడల్ కన్నా ఐదు రెట్లు అధికంగా బజాజ్ పల్సర్ అమ్మడవుతోండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, August 9, 2011, 13:06 [IST]
English summary
Bollywood actor John Abraham performed a stunt with a 150 kg Pulsar bike in his upcoming movies 'Force', the remake version Telugu Movie Garshana.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+