ఈబేలో కేట్ మిడిల్టన్ ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కారు వేలం

Kate Middleton
రాయల్ వెడ్డింగ్‌తో ఒకటై యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న రాయల్ దంపతులు ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్‌ల గురించి మరోసారి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యువరాజును మనువాడిన ఈ అందాల సుందరి కేట్ మిడిల్టన్ ఉపయోగించిన వస్తువు ఒకటి ఇప్పుడు వేలానికి వచ్చింది.

కేట్ ఉపయోగించిన బ్లూ కలర్ "ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్" కాంపాక్ట్ కారును ఆన్‌లైన్ ఆక్షన్ సంస్థ ఈబే (eBay) వేలానికి ఉంచింది. ఈ కారును కేట్ 2001లో 10,818 యూరోలు చెల్లించి కొనుగోలు చేశారు.

మీడియా కథనాల ప్రకారం.. కేట్ సోదరుడు జేమ్స్ ఈ కారును ఓ సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్‌కు విక్రయించినట్లు సమాచారం. అప్పటికి ఈ కారు రీడింగ్ 60,000 మైళ్ల దూరం ప్రయాణించినట్లు సూచించబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు కనీస బిడ్డింగ్ 20,000 యూరోల వద్ద ప్రారంభమైన 24వ తేదీన కేట్ కారు ఆక్షన్‌ను ఈబే ఖరారు చేయనుంది.

కాగా.. ఈ కారుకు ఇప్పటికే 15 బిడ్‌లు రాగా.. ప్రస్తుతం బిడ్డింగ్ ధర 35,100 యూరోలుగా ఉంది. మరి ఈ అందాల సుందరి అందమైన వస్తువును ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే మరొక్క రోజు వేచి ఉండక తప్పదు. ఈబేకు సంబంధించి మరిన్ని వివరాలకై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 23, 2011, 16:14 [IST]
English summary
Duchess of Cambridge Kate Middleton's Volkswagen Golf went under hammer. The blue color compact car is being auctioned in eBay on 24th July 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+