రీకాల్ కంపెనీల జాబితాలోకి చేరిన కియా మోటార్స్

Kia Recall
ఏదో ఒక సమస్యతో వాహనాలను రీకాల్ చేస్తున్న కంపెనీల జాబితాలోకి తాజాగా మరో కంపెనీ వచ్చి చేరింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియో మోటార్స్ అమెరికాలో సుమారు 10,000 లకు పైగా కార్లను రీకాల్ చేయనుంది. అమెరికాలో కియా విక్రయించిన "సొరెంటో" కార్లలో ముందు వైపు ఉండే ఎయిర్‌బ్యాగ్‌లలో సమస్యలు ఉన్నట్లు అమెరికా భద్రతా అధికారులు ఫిర్యాదు చేయడంతో కంపెనీ ఈ రీకాల్ చేయనుంది.

సొరెంటో కార్లలో ముందువైపు అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు చిన్నపిల్లలకు సురక్షితం కాదని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మనిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్ఏ) ఈ రీకాల్‌కు సిఫారసు చేసింది. ఫ్రంట్ సీటులో కూర్చున్న వ్యక్తి బరువును బట్టి ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్ సెన్సార్‌లు పనిచేస్తాయి.

అయితే, చిన్న పిల్లల విషయంలో వారి బరువుకు, సెన్సార్‌లకు నిర్దేశించిన బరువుకు సంబంధం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో చిన్నపిల్లు కూర్చున్న సీటు యొక్క ఎయిర్‌బ్యాగ్స్ పనిచేయడం లేదని ఎన్‌హెచ్‌టిఎస్ఏ పేర్కొంది. 2007-09 కాలంలో తయారైన కియా సొరెంటో కార్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి. కాగా.. ఈ లోపం కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2011, 11:57 [IST]
English summary
Kia, the South Korean carmaker will be recalling more than 10,000 cars in the US after the US safety authority reported a faulty front air bag. The National Highway Traffic Safety Administration (NHTSA) has recommended the recall of the Kia Sorento after it found that the front air bags Kia had used in the Sorento were not safe for children.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+