భారత్‌లో రెండవ అత్యంత ఖరీదైన కారు 'కోయినిగ్‌సెగ్ అగెరా'

Koenigsegg Agera
రోడ్డుపై రయ్.. అంటూ బుల్లెట్ వేగంతో దూసుకుపోయే ఓ సూపర్ కారును స్వీడన్‌కు చెందిన కోయినిగ్‌సెగ్ కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. "కోయినిగ్‌సెగ్ అగెరా"గా పిలువబడే ఈ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారు గరిష్టంగా గంటకు 435 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో బుగాటి సూపర్ కార్ తర్వాత.. కోయినిగ్‌సెగ్ రెండవ అత్యంత ఖరీదైన కారు కావడం విశేషం. గతేడాది నవంబర్‌లో విడుదలైన బుగాటి స్పోర్ట్స్ కారు ధర రూ. 16.2 కోట్లు అయితే కోయినిగ్‌సెగ్ అగెరా సూపర్ కారు ధర రూ. 12.5 కోట్లు. అగెరా కారు 5 లీటర్ బై-టర్బో వీ8 ఇంజన్‌తో 1,115 హర్స్‌పవర్‌ను కలిగి ఉంటుంది.

ఈ మోడల్ కార్లు సంవత్సరం మొత్తం మీద 16-18 యూనిట్లు మాత్రమే తయారవుతాయంటేనే వీటికున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. వీటిలో ఒకటి లేదా రెండు కార్లను మాత్రమే భారత మార్కెట్లో విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది.

తమ కార్లను భారత్‌లోకి దిగుమతి చేసుకునేందుకు రాహుల్ భాటియా ప్రమోట్ చేసిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థతో ఈ స్వీడన్ కంపెనీ టైఅప్ ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ కార్లను విక్రయించడానికి ఎలాంటి డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయకుండా.. నేరుగా హై నెట్‌వర్క్ కలిగిన వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎస్టాబ్లిష్‌డ్ ప్రోడక్ట్స్ అధ్యక్షుడు, సీఈవో నిగెల్ ఏ హార్‌వుడ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2011, 10:51 [IST]
English summary
To meet the top most speed among the cars say more than 400 km / hr, here’s a car which can fill in the fantasy – Koenigsegg Agera from the Swedish based Inter Globe. The car is priced for Rs12.5 crore to be the second most expensive car after Bugatti priced at Rs16.2 crore. This Agerra comes fitted with a 5. Lit bi-turbo V8 engine to deliver the horsepower of 1115 to prick 0-100 km/hr in 2.9 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+