సింగూర్ బిల్లుపై కలకత్తా హైకోర్టులో టాటాకు చుక్కెదురు

అసలు సింగూరు బిల్ ఏం చెబుతోంది..?
సింగూరు బిల్లు పూర్తి పేరు 'సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 2011'. కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాటా మోటార్స్‌కు కేటాయించిన భూముల్లో 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు కేటాయించడం ఈ బిల్లు ముఖ్య అజెండా. సింగూర్‌లోని నానో కారు ప్లాంటును టాటా మోటార్స్ అభివృద్ధి చేయడంలో విఫలమైందని, ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని, అందువల్లనే ఈ భూములను తిరిగి వెనక్కు తీసుకుంటున్నామని బెంగాల్ ప్రభుత్వం తన బిల్లులో పేర్కొంది. జూన్ 14వ తేదీన సింగూర్ బిల్లును మమత బెనర్జీ పాస్ చేయగా, పశ్చిమా బెంగాల్ గవర్నర్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.


Click it and Unblock the Notifications








