గంటకు 350 కి.మీ. వేగం..! నడిపే సత్తా ఉందా..?

లాంబోర్గిని నుండి వస్తున్న లేటెస్ట్ కారు అయిన అవెంటేడర్ ఎల్‌పి 700-4ను తొలిసారిగా గడచిన మార్చి నెలలో జెనీవా మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఉపయోగించే కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించి దీన్ని డిజైన్ చేశారు. ఫలితంగా ఇది తక్కువ బరువును కలిగి ఉండి మరింత వేగంగా పరుగులు తీస్తుంది. అవెంటేడర్ ఎల్‌పి 700-4 కేవలం 2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కత్తెర (సిజర్స్) డోర్స్ ఈ కారుకు మరో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
ఈ కారుకు ఇప్పటికే ఇండియా నుండి 20 ఆర్డర్లు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కారు మొత్తం 1,500 యూనిట్లకు పైగా ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. లాంబోర్గిని అవెంటేడర్ ఎల్‌పి 700-4 సూపర్ స్పోర్ట్స్ కారు పూర్తిగా ఇటలీలో తయారై సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూపంలో భారత్‌కు రానుంది. దేశీయ విపణిలో దీని ధరను రూ.3.69 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. భారత్‌లోని 'ఎక్స్‌క్లూజివ్ మోటార్స్' ద్వారా ఇది లభ్యం కానుంది. దీని వెయిటింగ్ పీరియడ్ 18 నెలలు.


Click it and Unblock the Notifications








