సింగూర్ భూమిని ఖాళీగా ఉంచలేదు: టాటా మోటార్స్

Ratan Tata with Nano Car
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్ ఆమోదించిన సింగూర్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అండ్ రిహాబిలేషన్ యాక్ట్ 2011 బిల్లును సవాల్ చేసిన టాటా మోటార్స్, నానో కారు ప్రాజెక్టు కోసం లీజ్‌కు తీసుకున్న సింగూర్ భూములను ఖాళీగా ఉంచలేదని, సరిగ్గానే ఉపయోగించుకున్నామని కలకత్తా హై కోర్టుకు తెలిపింది.

పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (లీజ్ ఇచ్చినవారు) టాటా మోటార్స్‌ (లీజ్ తీసుకున్నవారు)కు లీజ్ ఇచ్చిన 997.11 ఎకరాల భూమిని లీజు ఇచ్చినప్పటి నుంచీ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసే వరకూ కూడా ఎక్కడా ఖాళీగా ఉంచలేదని కంపెనీ కౌన్సిలర్ సమ్రాదిత్య పాల్ కోర్టులో జస్టిస్ సౌమిత్రా పాల్‌కు తెలియజేశారు.

ఈ లీజు అగ్రిమెంట్ ప్రకారం.. లీజు అమలులోకి వచ్చిన తర్వాతి నుంచి సింగూరు భూములు 90 ఏళ్లపాటు టాటా మోటార్స్‌తోనే ఉంటాయని పాల్ తెలిపారు. కంపెనీ అధిక మొత్తాలలో పెట్టుబడులను వెచ్చించి భూములను అభివృద్ధి చేసి, రికార్డు సమయంలో కేవలం 13 నెలల్లోనే ప్లాంటును ఏర్పాటు నానో కారు ట్రైల్ ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించిందని ఆయన తెలిపారు.

ఈ ప్లాంటు అభివృద్ధి మరియు నిర్మాణం కోసం కంపెనీ రూ. 1,800 కోట్లు వెచ్చించిందని, నవంబర్ 2008 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించిందని పాల్ చెప్పారు. టాటా మోటార్స్ ఇప్పటికే మార్చి 2012 వరకూ లీజు అద్దెను చెల్లించిందని, ఈ అగ్రిమెంట్ ప్రకారం.. 90 ఏళ్ల వరకూ లీజు ఇచ్చివారి నుండి ఎలాంటి అంతరాయం లేకుండా ఒప్పందం సాఫీగా సాగాలని పేర్కొనబడి ఉందని ఆయన గుర్తు చేశారు.

కాగా.. పశ్చిమ బెంగాల్‌ సర్కారుకు మరియు టాటా మోటార్స్ మధ్య జరుగుతున్న ఈ భూవివాదంలో విచారణ రేపు కూడా కొనసాగనుంది. సింగూర్ బిల్లును సవాల్ చేస్తూ జూన్ 22వ తేదీన కలకత్తా హైకోర్టులో టాటా మోటార్స్ ఓ పిటిషన్‌ను దాఖలు చేయగా, జులై 4వ తేదీన దాన్ని సవరణ చేస్తూ మరో పిటిషన్‌ను దాఖలు చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 17:43 [IST]
English summary
Tata Motors Ltd, told to Calcutta High Court that, the land issued for their small Tata Nano car project at Singur was utilised and not kept idle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+