వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి రానున్న ల్యాండ్ రోవర్ ఎవోక్

Land Rover Evoque
టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటన్ అనుబంధ సంస్థ ల్యాండ్ రోవర్ ప్రపంచ మార్కెట్లో అందిస్తున్న అత్యంత ప్రాచుర్యమైన మోడల్ 'ల్యాండ్ రోవర్ ఎవోక్' లగ్జరీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం)ను భారత్‌కు పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2012 ఆరంభం నాటికి ఈ లగ్జరీ కారు భారత రోడ్లపై పరుగులు పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి నెలలో న్యూఢిల్లో జరగనున్న ఆటో ప్రదర్శనలో కాంపాక్ట్ మరియు ఫ్యూయెల్ ఎఫీషియంట్ శ్రేణి వాహనాలను ల్యాండ్ రోవర్ ప్రదర్శనకు ఉంచనుంది.

ఐదు డోర్లు కలిగిన ఈ లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ క్లాస్, టొయోటా ప్రాడో, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, ఆడి క్యూ7 మోడళ్లకు సవాల్ విసరనుంది. పూణేలో కొత్తగా ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంటులో ల్యాండ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా దిగుమతి చేసుకొని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ను టాటా మోటార్స్ 2008లో స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ బ్రాండ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ బ్రాండ్‌గా ఎదుగుతూ.. అత్యధిక లాభాలను నమోదు చేస్తూ టాటా మోటార్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 4, 2011, 16:58 [IST]
English summary
Tata Motors British subsidiary Land Rover is gearing-up to roll-out its popular SUV Land Rover Evoque into Indian market by early 2012. The company will be displaying a range of compact and fuel efficient vehicles of its British subsidiary Land Rover at the upcoming Delhi Auto Expo in January 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+