డిస్కవరీ 4, రేంజ్ రోవర్‌లను విడుదల చేయనున్న ల్యాండ్ రోవర్

Discovery 4
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ సొంతం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ బ్రాండ్ ల్యాండ్ రోవర్ త్వరలో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో డిస్కవరీ 4 మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లను యూకెలో విడుదల చేయనుంది. ఈ కొత్త మోడళ్ల ధరలు 37,995 పౌండ్లు (దాదాపు రూ. 27 లక్షల) నుండి ప్రారంభమవుతాయి. 2012 మోడల్ డిస్కవరీ 4 మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వాహనాలు 3-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటుగా ఎనిమిది ఆటోమేటిక్ గేర్లు కలిగిన వ్యవస్థతో లభిస్తాయి. ఈ ఎనిమిది గేర్ల వ్యవస్థ కారణంగా స్మూత్ పెర్ఫామెన్స్‌తో పాటు ఇందన సామర్థ్యం కూడా పెరుగుతుంది.

డిస్కవరీ 4 ప్రైస్ ట్యాగ్ 37,995 పొండ్లు ఉండగా రేంజ్ రోవర్ స్పోర్ట్ 48,795 పౌండ్లుగా ఉన్నాయి. కాగా.. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్, రెండు బ్రిటన్ యూనిట్లు అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తున్న అన్ని మోడళ్లను కూడా భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటికే అధికంగా ఉన్న దిగుమతి సుంఖాలను దృష్టిలో ఉంచుకొని అతి ప్రాముఖ్యమైన మోడళ్లను మాత్రమే దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో డిస్కవరీ 4 మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడళ్లకు అంతర్జాతీయ మార్కెట్ల మంచి స్పందన లభిస్తే వీటిని భారత మార్కెట్లో కూడా టాటా మోటార్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2011, 12:17 [IST]
English summary
Land Rover, the British car brand owned by Tata Motors, today said it would introduce two new variants of the Discovery 4 and Range Rover Sports this October in the UK. The new models will have a starting price of about Rs.27 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+