సరికొత్త లారా ఆర్ఎస్ ఎడిషన్‌ను విడుదల చేయనున్న స్కొడా

స్కొడా లారా ప్రీమియం సెడాన్ విజయవంతంగా దూసుకు పోతున్న నేపథ్యంలో తమ బ్రాండ్ వినియోగదారులకు మరింత కొత్తదనాన్ని అందించేందుకు స్కొడా ముందుకొచ్చింది. స్పోర్టీ అనుభూతి, సరికొత్త లుక్ కోరుకునే వారి కోసం స్కొడా అందిస్తున్న లారాలో కొత్త ఆర్ఎస్ ఎడిషన్ (Rally Sport Edition)ను కంపెనీ పరిచయం చేసింది.
మోటార్ స్పోర్ట్ హెరిటేజ్‌లో స్కొడా తన 110 పదేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి మరియు ఇటీవలి 2010 ఐఆర్‌సి ఛాంపియన్‌షిప్ విజయానికి గుర్తుంగా సరికొత్త ర్యాలీ స్పోర్ట్ (ఆర్ఎస్) ఎడిషన్ లారాను స్కొడా విడుదల చేసింది. కొత్త స్కొడా లారా ఆర్ఎస్ టిఐఐ ఇంజన్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అత్యుత్తమ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








