శాంతి భద్రతల సమస్య వల్లే సింగూర్‌ను వదలిపెట్టాం..!!

పశ్చిమ బెంగాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా టాటా నానో కారు ప్రాజెక్టును తాము నిలిపివేయలేదని, సింగూర్ ప్రాంతంలో తలెత్తిన శాంతి భద్రతల సమస్యలే తమను బలవంతంగా గుజరాత్‌కు తరలివెళ్లేలా చేశాయని టాటా మోటార్స్ లిమిటెడ్ కౌన్సిల్ సమ్రాదిత్య పాల్ కోర్టుకు నివేదించారు.
ఈ మేరకు సింగూర్‌ను నుంచి నానో కారు ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించాల్సి వచ్చిన పరిస్థితులను వివరిస్తూ జస్టిస్ సౌమిత్రా పాల్‌కు ఆయన ఓ నివేదిక సమర్పించారు. ప్లాంటు పనులు 90 శాతం పూర్తయ్యయని, అంతేకాకుండా ఆ సైట్‌లో కార్యాలయ భవనాలు వంటివి కూడా నిర్మించామని ఆ నివేదికలో పాల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








