మార్చి నెలలో మార్కెట్లోకి రానున్న నిస్సాన్ ఎలక్ట్రిక్ కార్ 'లీఫ్'

ఇందుకోసం నిస్సాన్ భారీ కసరత్తులు చేయనుంది. అందులో భాగంగా జపాన్ ఫ్యాక్టరీలో ఉన్న తమ సిబ్బంది షిఫ్టులను పెంచాలని కంపెనీ భావిస్తోంది. గత మూడు నెలల క్రితం ప్రారంభించిన లీఫ్ ఉత్పత్తి ఇప్పటి వరకూ 3,000 యూనిట్ల మార్కును చేరుకుంది. మార్చి చివరినాటికి నెలకు 4,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని నిస్సాన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ సమయానికి (మార్చి 31, 2011 నాటికి) మొత్తం ఉత్పత్తిని 10,000 యూనిట్ల మార్కును తాకాలనేది కంపెనీ ఉద్దేశ్యం. ఇందుకు గానూ..శెలవు దినాలు, రాత్రి పనివేళల్లో సైతం శ్రమించి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని నిస్సాన్ భావిస్తోంది.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రస్థానాన్ని చేరుకోవాలనేది కంపెనీ ప్రధాన లక్ష్యం, ఇందుకోసం నిస్సాన్ ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రీనాల్ట్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. లీఫ్ కారు ఇప్పటికే జపాన్, అమెరికా దేశాలకు చేరిపోయింది. ఒక ఏడాది విరామం తర్వాత అమెరికాలో ఉన్న టెన్నెస్సీ, సుందర్ లాండ్ ఫ్యాక్టరీలలోనే లీఫ్‌ను తయారు చేయనున్నట్లు నిస్సాన్ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఎలక్ట్రిక్ కార్ల కన్నా నిస్సాన్ వేగంగా పయనిస్తుంది. నిస్సాన్ లీఫ్ కారు ప్రత్యేకతలు మీ కోసం...


Click it and Unblock the Notifications








