అమెరికా లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రస్థానాన్ని కోల్పోనున్న లెక్సస్

Lexus Luxury Car
లగ్జరీ కార్లకు లెక్సస్ బ్రాండ్ పెట్టింది పేరు. ప్రపంచపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ, జపాన్‌కు చెందిన టొయోటా మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న టాప్ లగ్జరీ కార్ బ్రాండ్ "లెక్సస్" ఇకపై తన అగ్రస్థానానికి ముగింపు పలకనుంది. గడచిన 11 ఏళ్లుగా అమెరిగా మార్కెట్లో టాప్ లగ్జరీ బ్రాండ్‌గా ఉన్న లెక్సస్ ఇటీవల జపాన్‌లో సంభవించిన భుకంపం, సునామీల కారణంగా విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో మార్కెట్లో తన అగ్రస్థానాన్ని కోల్పోనుందని లెక్సస్ డివిజన్ జనరల్ మేనేజర్ మార్క్ టెంప్లిన్ పేర్కొన్నారు. 2011లో లెక్సస్ అమ్మకాలు 17 శాతానికి పడిపోయి 1,90,000 యూనిట్లుగా నమోదు కావచ్చని ఆయన తెలిపారు.

లెక్సస్ కార్లకు అమెరికా అతిపెద్ద మార్కెట్, అన్ని లెక్సస్ మోడళ్లు కూడా (క్రాసోవర్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఆర్ఎక్స్ 350 మినహా) జపాన్‌లోనే తయారవుతాయి. కేంబ్రిడ్జ్‌లోని ఆన్టారియో ప్లాంటులో ఆర్ఎక్స్ 350 ఉత్పత్తి అవుతోంది, ఈ ప్లాంటులో సెప్టెంబర్ నాటికి ఇది పూర్తిస్థాయిలో జరుగుతుందని టెంప్లిన్ తెలిపారు. ప్రస్తుతం జపాన్‌లో లెక్సస్ కార్లను అసెంబ్లింగ్ చేస్తున్న దాదాపు అన్ని ప్లాంట్‌లు కూడా పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించాయి. అయితే, ఆర్ఎక్స్ 450హెచ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఉత్పత్తి మాత్రం అక్టోబర్ నెల నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగే అవకాశాలున్నాయి. అమెరికా మార్కెట్లో అమ్ముడవుతున్న ఆర్ఎక్స్ మోడళ్లలో ఇది దాదాపు 15-20 శాతం వాటాను కలిగి ఉంది.

గడచిన జూన్ నెలలో డీలర్ల వద్ద లెక్సస్ బ్రాండ్‌‌ కీలక ఉత్పత్తులు లేని కారణంగా అమెరికా మార్కెట్లో ఈ కార్ల అమ్మకాలు 38 శాతానికి పడిపోయాయి. డీలర్ల సాధారంగా ఉంచే స్టాక్ కన్నా ఇవి 50 శాతానికి తగ్గిపోవడంతో విక్రయాలు కూడా తగ్గిపోయాయి. 2011 ప్రధమార్థంలో లెక్సస్ అమ్మకాలు 18 శాతం తగ్గి 88,010 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే కాలానికి మెర్సిడెస్ బెంజ్ విక్రయాలు మాత్రం 7 శాతం వృద్ధి చెంది 1,10,926 యూనిట్లుగా ఉండగా, బిఎమ్‌డబ్ల్యూ విక్రయాలు 13 శాతం పెరిగి 1,13,705 యూనిట్లతో ప్రస్తుతానికి లెక్స్ బ్రాండ్ స్థానాన్ని అక్రమించుకుంది. 1997 తర్వాత లెక్సస్‌ను ఓవర‌టేక్ చేయడం ఇదే మొదటిసారి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2011, 8:08 [IST]
English summary
Japanese auto major Toyota Motor Corp's brand Lexus will end its streak of 11 years as the top luxury brand in the U.S. market due to lost sales in the aftermath of the Japan earthquake and tsunami, said Mark Templin, Lexus Division general manager.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+