పండుగ సీజన్లో ఆటోమొబైల్ కంపెనీల ఆఫర్లే ఆఫర్లు..!!

Tata Nano
గడచిన రెండు మూడు నెలలుగా కార్ల అమ్మకాలు మందగించడంతో రానున్న పండుగ సీజన్‌ను కార్ల కంపెనీలు టార్గెట్ చేసుకున్నాయి. పాత స్టాక్‌లను క్లియర్ చేసుకునేందుకు మరియు విక్రయాలు భారీగా పెంచుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు వివిధ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

వాస్తవానికి పండుగ సీజన్‌లలో డీలర్లు, తయారీదారులు తమా మోడళ్లపై వివిధ ఆఫర్లను ప్రకటించడం సహజమే అయినప్పటికీ... తగ్గిన విక్రయాల జోరు, పెరిగిన ఇంధన ధరలు మరియు అధిక వడ్డీ రేట్ల కారణంగా ఈ ఆఫర్లు మరింత ఆకర్షనీయంగా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అందిస్తున్న మోడళ్లపై రూ. 10,000 నుంచి రూ. 1,60,000 వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కూడా వివిధ మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ అధికంగా విక్రయించే ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ మోడళ్లపై అందిచే ప్రయోజనాలను పెంచినట్లు కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో అందిస్తున్న సెడాన్ వేరియంట్ కారు వెంటో పెట్రోల్ వెర్షన్‌ను కేవలం 6.99 శాతం వడ్డీరేటుకే అందిస్తోంది.

మెర్సిడెసె బెంజ్ అందిస్తోన్న సి-క్లాస్‌, అలాగే, ఆడి అందిస్తోన్న ఏ4 సెడాన్‌ వంటి లగ్జరీ కార్లపై కూడా సదరు కంపెనీ జీరో పర్సెంట్ (0%) వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'పై కంపెనీ 9.25 శాతం వడ్డీరేటును అందిస్తుండగా, హ్యుందాయ్ 5.99 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది.

హోండా సియోల్ కార్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్‌ 'హోండా సిటీ'పై కంపెనీ రూ. 66,000 తగ్గింపును ప్రకటించగా, హోండా జాజ్‌పై ఏకంగా రూ. 1.60 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తుంది.

దేశీయ ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు ఐ10 మోడల్‌పై రూ. 45,000 తగ్గింపును అందిస్తోంది.

కాగా.. ఫియట్ కంపెనీ అందిస్తోన్న పుంటో, లినియా మోడళ్లలో పెట్రోల్ వేరియంట్ ధరకే డీజిల్ మోడళ్లను అందిస్తామని ప్రకటించింది. కాబట్టి కొత్త కార్లు కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 15:27 [IST]
English summary
Indian carmakers are offering huge discounts and schemes to improve their sales performance. Following the drastic reduction in sales in June carmakers are being forced to offer more discounts or risk loosing market share. Even carmakers who enjoy huge market shares haven't been spared by the reduced sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+