లగ్జరీ కార్ల డిమాండును తీర్చడంలో విఫలమవుతున్న కంపెనీలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి 8, పోర్ష్ కాయన్నె, మెర్సిడెస్ ఎస్ 500 వంటి లగ్జరీ కార్లను పొందడానికి వినియోగదారులు ఇప్పటికీ వేచి చూస్తున్నారు. 2010 భారత ఆటో మార్కెట్లో ఒక్క లగ్జరీ కార్ల విభాగమే రెండితల (70 శాతం) వృద్ధిని సాధించి 15,000 యూనిట్లను విక్రయించింది. ఫలితంగా ఇంత భారీగా పెరిగిన డిమాండుకు అనుగుణంగా కార్లను సప్లయ్ చేయండలో జాప్యం జరిగిందని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పేర్కొంది. సాధారణంగా లగ్జరీ కారును పొందాలంటే కనీసం 4-6 వారాల సమయం పడుతుంది. ప్రపంచ లగ్జరీ కార్ల తయారీదారులైన బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్, ఆడి వంటి కంపెనీలకు ఇది ఓ నిబంధన.
కానీ.. పెరిగిన డిమాండ్ కారణంగా ఇప్పడు కారు డెలివరీ వ్యవధి కోసం వేచి ఉండే సమయం 3-4 నెలలకు పెరిగిపోయింది. మరికొన్ని కంపెనీలకైతే.. దాదాపు ఆరు నెలల సమయం కూడా పడుతుంది. భారత ఆటో మార్కెట్ ఇంత వృద్ధిని కనబరుస్తుందని విదేశీ కంపెనీలు అంచనా వేసినట్లు లేదు... ఫలితంగా భారత మార్కెట్లో లగ్జరీ కార్ల డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను సరఫరా చేయడంలో కంపెనీలు విఫలమయ్యాయి.


Click it and Unblock the Notifications








