లగ్జరీ కార్ల డిమాండును తీర్చడంలో విఫలమవుతున్న కంపెనీలు

Luxury Car
యావత్ ప్రపంచం ఓవైపు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటుంటే... భారత్‌లో మాత్రం ఆ ఛాయలు మెల్లిగా తొలిగిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలు ఊహంచని అభివృద్ధిని కనబరుస్తున్నాయి. వీటిల్లో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటి. గతేడాది భారత ఆటోమొబైల్ రంగం భారీ వద్ధి (31 శాతం)ని కనబరిచింది. 2010లో భారత ఆటో మార్కెట్లో లగ్జరీ కార్లు, చిన్నకార్లు గట్టి పోటీను ఎదుర్కుంటూ.. ఈ విభాగాల్లో అధిక ప్రాధాన్యత వహించాయి. అయితే లగ్జరీ కార్ల విషయానికి వస్తే... దేశంలో ఎన్నడూలేనివిధంగా వీటికి డిమాండ్ ఊపందుకోవడంతో సరైన సమయంలో మార్కెట్ డిమాండును తీర్చడంలో పలు కంపెనీలు విఫలమయ్యాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఆడి 8, పోర్ష్ కాయన్నె, మెర్సిడెస్ ఎస్ 500 వంటి లగ్జరీ కార్లను పొందడానికి వినియోగదారులు ఇప్పటికీ వేచి చూస్తున్నారు. 2010 భారత ఆటో మార్కెట్లో ఒక్క లగ్జరీ కార్ల విభాగమే రెండితల (70 శాతం) వృద్ధిని సాధించి 15,000 యూనిట్లను విక్రయించింది. ఫలితంగా ఇంత భారీగా పెరిగిన డిమాండుకు అనుగుణంగా కార్లను సప్లయ్ చేయండలో జాప్యం జరిగిందని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పేర్కొంది. సాధారణంగా లగ్జరీ కారును పొందాలంటే కనీసం 4-6 వారాల సమయం పడుతుంది. ప్రపంచ లగ్జరీ కార్ల తయారీదారులైన బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్, ఆడి వంటి కంపెనీలకు ఇది ఓ నిబంధన.

కానీ.. పెరిగిన డిమాండ్ కారణంగా ఇప్పడు కారు డెలివరీ వ్యవధి కోసం వేచి ఉండే సమయం 3-4 నెలలకు పెరిగిపోయింది. మరికొన్ని కంపెనీలకైతే.. దాదాపు ఆరు నెలల సమయం కూడా పడుతుంది. భారత ఆటో మార్కెట్ ఇంత వృద్ధిని కనబరుస్తుందని విదేశీ కంపెనీలు అంచనా వేసినట్లు లేదు... ఫలితంగా భారత మార్కెట్లో లగ్జరీ కార్ల డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను సరఫరా చేయడంలో కంపెనీలు విఫలమయ్యాయి.

Most Read Articles

English summary
The beeline queue for driving out the luxury car is inevitable from the point of view of the makers. People are struggling to contain their unrest to get the cars of BMW X1, Audi 8, Porsche Cayenne and Mercedes S500. There has been a double range growth, 70%, of luxury cars in the Indian market in 2010 (15000 units) making the makers find the difficulty in meeting the demand.
Story first published: Monday, February 14, 2011, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X