భారత మార్కెట్లో లగ్జరీ కార్లను విక్రయించనున్న ఎబి గ్రూప్

ఎబి గ్రూపు ఇప్పటివరకూ సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించడం, సర్వీస్ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. తాజాగా వీటితో పాటు కొత్తగా విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా ఎబి గ్రూపు డైరెక్టర్ ఎ.సాదిక్ మాట్లాడుతూ.. భారత్‌లో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు తమకు తెలుసునని, ఈ డిమాండును దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరంలో లగ్జరీ కార్లను దిగుమతి చేసుకొని విక్రయిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎబి గ్రూపు రూ. కోటి ఆపై ధరల కలిగిన హై-ఎండ్ (అధిక విలువ కలిగిన) కార్లకు సర్వీసింగ్ చేస్తుంది.
భారత్‌లో లగ్జరీ కార్ల తయారీదారులు వినియోగదారులపై సర్వీస్ బిల్లుల మోత మోగిస్తున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎబి గ్రూపు సర్వీస్ స్టేషన్‌ను "ది టోరక్యూ" అని పిలుస్తారు. లగ్జరీ కార్లకు ఈ సంస్థ ఆకర్షనీయమైన ధరలకే సర్వీసులను అందిస్తుంది. వాహన తయారీదారుల కన్నా తక్కవ ధరలకే ఎబి గ్రూపు సర్వీసులను అందిస్తుంది. సర్వీసు సమస్యల వల్ల కొన్ని లగ్జరీ కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించలేకపోతున్నాయని, వారి వద్ద సరైన నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు లేకపోవడం లేదా ధరలు అధికంగా ఉండటం, కొందరు లగ్జరీ కార్ల యజమానులైతే టెక్నీషియన్లను సింగపూర్ వంటి దేశాల నుంచి పిలిపించుకుంటున్నారని సాదిక్ చెప్పారు.


Click it and Unblock the Notifications








