టాప్ ఎండ్ లగ్జరీ కార్లు వద్దు.. ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లే ముద్దు..

మరోవైపు లగ్జరీ కార్ ప్రియులు కూడా టాప్ ఎండ్ లగ్జరీ కార్ వేరియంట్ల కంటే ఎంట్రీ లెవర్ లగ్జరీ కార్ వేరియంట్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుండటం కూడా మార్కెట్ మందగమనానికి మరో కారణమని చెప్పవచ్చు. భారత లగ్జరీ కార్ మార్కెట్లో టాప్ 3 బ్రాండ్‌లు అయిన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడిలు కూడా జులై నెలలో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి.
బిఎమ్‌డబ్ల్యూ మొత్తం అమ్మకాలలో కంపెనీ అందిస్తున్న సబ్-కంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 (ధర రూ. 22 లక్షల నుండి ప్రారంభం) మోడల్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. జులై నెలలో బిఎమ్‌డబ్ల్యూ మొత్తం 840 కార్లను విక్రయించింది. అలాగే, అడి విషయంలో కూడా కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవర్ లగ్జరీ సెడాన్ ఆడి ఏ4 (ధర రూ. 27.18 లక్షలు) కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
లగ్జరీ సెగ్మెంట్లో వృద్ధి రూ. 30 లక్షలకు పైన ధర కలిగి ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ల నుంచి రావడం లేదని ఆడి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. జులై నెలలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు 17 శాతం క్షీణించి 478 కార్లను మాత్రమే విక్రయించింది. అలాగే, బిఎమ్‌డబ్ల్యూ అమ్మకాలు 57 శాతం తగ్గగా ఆడి అమ్మకాలు 69 శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications








