హైదారాబాద్‌లో పెరుగుతున్న లగ్జరీ కార్ల వినియోగదారులు

కానీ.. గ్లోబలైజేషన్ పుణ్యమా అని, ప్రస్తుతం భారత్‌లో దాదాపు అన్ని కంపెనీల లగ్జరీ కార్లు లభిస్తున్నాయి. దీనికితోడు కొత్త కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తుండటంతో ఆ పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఇక్కడ ఉన్న కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాలు, విలాసవంతమైన ఫీచర్లతో అందిస్తుండటంతో లగ్జరీ కార్ మార్కెట్ పరిమాణం విస్తరించి దేశంలో ఇలాంటి కార్లను ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా 10 లక్షల రూపాయల ధర మించిన కార్లను లగ్జరీ కార్లుగా చెప్పుకోవచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే.. గతంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఫారిన్ కార్లు ఎక్కడో ఒకసారి తళుక్కుమని మెరిసేవి. కానీ నేడు ఏ మూల చూసినా ఫారిన్ కార్లు దర్శనిమిస్తున్నాయి. గత కొద్ది కాలంగా చూస్తే.. మానవ జీనన ప్రమాణాలు మెరుగుపడుతుండటంతో ఈ కార్లను వినియోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఇక్కడి వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఫారిన్ కంపెనీలు హైదరాబాద్‌లో వచ్చి వాలుతున్నాయి. ఈ ఏడాది రాష్టవ్యాప్తంగా 6,512 లగ్జరీ కార్లు (రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల ధర కలిగినవి) అమ్ముడయ్యాయంటేనే వీటి వినియోగం ఎంత భారీగా పెరిగిందే ఇట్టే అర్థమవుతుంది.
సమాజంలో ఒకప్పుడు ఒక వర్గానికే మాత్రమే పరిమితమైన బిఎమ్‌డబ్ల్యూ, రోల్స్ రాయిస్, ఆడి, క్యేనే టర్బో, రేంజ్ రోవర్ వోగ్, పోర్షే 911 టర్బో, జాగ్వార్, ల్యాండ్ రోవర్, వోక్స్‌వ్యాగన్ వంటి బ్రాండ్‌లను ఇప్పుడు సినీనటులు, రియల్టర్లు ఉపయోగిస్తున్నారు. తాజాగా 2.01 కోట్ల విలువ చేసే పోర్షే 911 టర్బో కారును హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేయడం విశేషం. అలాగే రూ. 1.22 కోట్లు పలికే పోర్షే 911 కార్రేరాస్ కారు కాడు ఇప్పుడ హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్‌మని పరుగులు తీస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లగ్జరీ కార్ల విషయంలో ఫారిన్ దేశాలను మరిపించినా ఆశ్చర్యం లేదనేది నిపుణుల అంచనా.


Click it and Unblock the Notifications








