మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎయిర్ కండిషన్ ట్రాక్టర్

Mahindra AC Tractor
నిప్పులు గక్కే ఎండలో ట్రాక్టర్ పొలం దున్నే రైతన్నలకు ఎండ నుండి ఉపశమనాన్ని మరియు ఊరటను కలిగించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా నడుం బిగించింది. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా వ్యవసాయ పరికరాలను తయారు చేసి రైతుల మన్ననలను పొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్‌ అండ్‌ ఎమ్‌) ఒడగుదు ముందుకు వేసి ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన ట్రాక్టర్‌ను దేశీయ విపణికి పరిచయం చేసింది.

పంజాబ్‌లోని లూథియానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 'కిసాన్ మేళా'లో "అర్జున్ ఇంటర్నేషనల్" అనే 85 హార్స్‌ పవర్‌ ఇంజిన్‌ సామర్థ్యం గల ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) ట్రాక్టర్‌ను కంపెనీ ప్రదర్శించింది. దేశంలోనే తొలిసారిగా తాము ఏసి క్యాబిన్ కలిగిన ట్రాక్టర్‌ను ఆవిష్కరిస్తున్నామని ఎమ్‌ అండ్‌ ఎమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ట్రాక్టర్ అండ్ ఫామ్ మెకానిజేషన్ బిజినెస్) బిష్వంభర్‌ మిశ్రా తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి ఇవి వాణిజ్యపరంగా భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అయితే, దీని ధర మాత్రం కాస్తంత అధికానే ఉండే అకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ 60 హెచ్‌పి ట్రాక్టర్ ధర (రూ. 7 లక్షలు) కన్నా రెట్టింపు ధర ఉండనుంది. మిశ్రా తెలిపిన దాని ప్రకారం, ఏసి ట్రాక్టర్ ధర రూ.15 లక్షల మేర ఉండొచ్చని అంచనా. మరి మండుటెండలో సైతం చల్ల చల్లగా వ్యవసాయం చేయాలంటే ఆ మాత్రం వెచ్చించక తప్పదేమో..!?

More from DriveSpark

Article Published On: Friday, September 23, 2011, 15:09 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M and M) showcased its 80 HP air conditioned tractor named ''Arjun International'' at ''Kisan Mela'' organized by the Punjab Agricultural University at Ludhiana. The AC tractor would be priced at Rs 15 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+