మహీంద్రా నుంచి డబుల్ క్యాబిన్ పికప్ 'జినియో'

Mahindra Pick Up
యుటిలిటీ వాహనాల తయారీలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా రవాణా అవసరాలకు అనుగుణంగా మరో చిన్నసైజు వాణిజ్య వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా మౌళిక మరియు నిర్మాణ రంగాల్లో పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు మరియు పరికరాలను తరలించేందుకు వీలుగా డబుల్ క్యాబిన్ కలిగిన పికప్ ట్రక్ 'జినియో' ఉత్పత్తిని ప్రారంభించింది.

ఇప్పటికే 'జినియో' ఫ్లాట్‌ఫామ్‌పై సింగిల్ క్యాబిన్ పికప్ ట్రక్‌లో క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటుగా ఒక్క ప్యాసింజర్ మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. అయితే, కొత్త పికప్ ట్రక్‌లో ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణించడంతో పాటు లగేజ్‌ను కూడా తీసుకువెళ్లేందుకు వీలుగా డబుల్ క్యాబిన్‌తో డిజైన్ చేసినట్లు కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ యొక్క మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ నాయర్ తెలిపారు.

కంపెనీ ఇప్పటికే డబుల్ క్యాబిన్ ఆప్షన్ కలిగిన బొలెరో పికప్ ట్రక్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. జినియో మరియు బొలెరో డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్‌లకు మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ. 38,000 మాత్రమే. జినియో డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్‌ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.46 మొదలుకొని హైయర్ వేరియంట్ ధర రూ. 5.95 లక్షల వరకూ ఉంటుదని, అంతేకాకుండా ఇది ఓ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి అని నాయర్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 16:02 [IST]
English summary
India's leading utility vehicle maker Mahindra and Mahindra rolled out the two cabin pick up called 'Genio' on Wednesday to meet the needs of infrastructure and construction space, where they are required to travel with their team and machinery.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+