వెరిటో సెడాన్ పట్ల సంతోషంగా ఉన్న ఎమ్ అండ్ ఎమ్

Mahindra Verito
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రస్తుతం స్వతహాగా అందిస్తున్న వెరిటో (ఒకప్పుడు లోగాన్) సెడాన్ పట్ల కంపెనీ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ మోడల్‌ను ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు సంయుక్తంగా తయారు చేసేవి. అప్పట్లో ఈ మోడల్‌కు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, ఈ జేవీలోని రీనాల్ట్ వాటాలను గత ఏప్రిల్‌లో ఎమ్ అండ్ ఎమ్ సొంతం చేసుకొన్న తర్వాత ఈ మోడల్‌ను రీడిజైన్ చేసి కొత్త పేరు (వెరిటో)తో మార్కెట్లోకి విడుదల చేసింది.

అప్పటి నుండి వెరిటో సెడాన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. గత ఏప్రిల్ నెలలో రీలాంచ్ అయిన వెరిటో దేశీయ సి-సెగ్మెంట్‌లో మంచి మైలేజ్‌ను ఇస్తూ ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో వెరిటో సెడాన్‌లో మరిన్ని వేరియంట్లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వెరిటోలో కొత్తగా రిఫ్రెష్ చేసిన మోడల్‌ను అలాగే, ప్రస్తుతం ఉన్న నాలుగు మీటర్ల పొడవు కలిగిన వెరిటో కన్నా చిన్నదిగా మరో మోడల్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతానికి వెరిటోలో రీనాల్ట్ ఇంజన్లే ఉపయోగిస్తున్నప్పటికీ త్వరలోనే వీటిని కూడా స్థానికంగానే తయారు చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. జూన్ 2010లో కేవలం 563 యూనిట్లు మాత్రమే అమ్ముడైన లోగాన్ కార్లు జూన్ 2011లో ఏకంగా 1,5410 యూనిట్లకు పెరిగాయంటేనే ఈ మోడల్‌కు లభిస్తున్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 30, 2011, 8:20 [IST]
English summary
Leading utility vehicle manufacturer Mahindra & Mahindra (M and M) seems to be happy with newly launched sedan Verito (Formally Logan). In June 2011 Verito sedan clocked sales of 1,510 units, as against 563 in June 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+