పరిశ్రమ అంచనాలను మించి వృద్ధి సాధిస్తాం: స్వరాజ్

Mahindra & Mahindra
ప్రముఖ వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన బ్రాండ్ 'స్వరాజ్' ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ అంచనాలకు మించి అధికంగా 10-15% వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. మంచి వర్షాభావ పరిస్థితులు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అధిక కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్) సహాయంతో ఈ వృద్ధిని సాధించడం సులువేనని కంపెనీ భావిస్తోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ట్రాక్టర్ మార్కెట్ 10-15 శతాం వృద్ధిని సాధించగలదని, మార్కెట్ వృద్ధి కన్నా అధిక వృద్ధిని సాధించే అంశంపై తాము దృష్టి సారించామని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ బిష్వాంభర్ మిశ్రా ధీమా వ్యక్తం చేశారు.

రుతుపవనాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వం వెచ్చింపులు, కూలీల కొరత మరియు కనీస మద్దతు ధరలు అన్నీ కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని, ఫలితంగా కంపెనీ వృద్ధిని సాధించగలదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎమ్ అండ్ ఎమ్ స్వరాజ్ డివిజన్ 24 శాతం వృద్ధిని కనబరిచింది. పరిశ్రమ 2009-10లో 30%, 2010-11లో 19.8% వృద్ధి చెందితే 2011-12లో మాత్రం 10-15% శాతం మధ్యలో వృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్వరాజ్ బ్రాండ్ ట్రాక్టర్లను తయారు చేస్తున్న పంజాబ్ ట్రాక్టర్స్ మెజారిటీ వాటాను మహీంద్రా అండ్ మహీంద్రా 2007లో కొనుగోలు చేసింది, తర్వాత 2009లో ఇది ఎమ్ అండ్ ఎమ్‌లో విలీనం అయి స్వరాజ్ డివిజన్‌గా ఏర్పడింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2011, 11:03 [IST]
English summary
Country's auto gaint Mahindra & Mahindra's farm equipment division Swaraj said it was aiming to perform better than the industry's expected growth of 10-15% during the current fiscal on the back of good monsoon and higher minimum support price (MSP) announced by the Centre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+