ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటా దక్కించుకున్న మహీంద్రా

అయితే వాటా కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ యజమాని సీఈఓ, మహీంద్రా గ్రూపు ప్రతినిధులు వెల్లడించలేదు. కానీ..రానున్న ఐదేళ్లలో కంపెనీ 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 460 కోట్ల)ను పెట్టుబడులుగా వెచ్చించనుందని వారు పేర్కొన్నారు. 135 సంవత్సరాల క్రితం దివాలా తీసి మూతపడిన ఈస్ట్ ఇండియా కంపెనీను 2005లో భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారి అయిన సంజీవ్ మెహతా కొనుగోలు చేశారు. ఎన్నో విమర్శలు ఎదురైనా మెహతా విజయవంతంగా ఈస్టిండియాను మళ్ళీ ప్రారంభించి, లండన్‌లో తొలుతగా ఓ లగ్జరీ ఫుడ్ స్టోర్‌ను ప్రారంభించారు.
మహీంద్రా గ్రూపు వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచపు తొలి నిజమైన గ్లోబల్ బ్రాండ్ అని, అంతర్జాతీయ వర్తక అభివృద్ధిపై శతాబ్దాలుగా ఎంతో ప్రభావాన్ని చూపిందని, అటువంటి సంస్థలో వాటా కొనుగోలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తమ కీర్తిని చాటుకోవడానికి మహీంద్రాకు ఓ చక్కని అవకాశం ఏర్పడిందని అన్నారు.


Click it and Unblock the Notifications








