గెస్ ది ప్రైజ్ కాంటెస్ట్ విజేతను ప్రకటించిన మహీంద్రా

Mahindra Guess the price of XUV 5OO Contest Winner
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తాజా అందిస్తున్న తొలి గ్లోబల్ ఎస్‌యూవీ "ఎక్స్‌యూవీ500" (ఎక్స్‌యూవీ ఐఫ్ డబుల్ ఓ) విడుదలకు ముందు "గెస్ ది ప్రైజ్" అనే కాంటెస్ట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్‌లో భాగంగా కొత్త ఎక్స్‌యూవీ500 ధరను ఖచ్చితంగా అంచనా వేసిన వారికి ఓ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని బహుమతిగా ఇస్తామని ఎమ్ అండ్ ఎమ్ పేర్కొంది.

కాగా.. ఈ కాంటెస్ట్‌లో కొల్హాపూర్‌కు చెందిన అమిత్ మాటే అనే గ్రాండ్ ప్రైజ్‌గా ఓ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని సొంతం చేసుకున్నారు. పూణేలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో నిర్వహించిన కార్యక్రంలో కంపెనీ అతనికి ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని తాళం చెవులను అందజేసింది. ఈ సందర్భంగా అమిత్ మాటే మాట్లాడుతూ.. చిన్నప్పటి ఓ మహీంద్రా వాహనాన్ని సొంతం చేసుకోవాలని కలగనే వాడినని, ఇప్పుడు ఆ కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 140 బిహెచ్‌పిల శక్తిని, 33 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2011, 12:58 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. (M&M), a part of the US $12.5 billion Mahindra Group, announced that Amit Mate, a technology consultant from Kolhapur, has been selected as the Grand Prize winner for the innovative ‘Guess the Price’ contest for the XUV500. The key of the new XUV500 was handed over to Amit Mate at a function held at a Mahindra dealership in Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+