2013-14 నాటికి లక్ష సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తాం: మహీంద్రా

Mahindra First Choice
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మల్టీ-బ్రాండ్ ప్రీ-ఓన్డ్ కార్ కంపెనీ 'మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్' భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ మార్కెట్లో ఒక లక్ష సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాదిలో కంపెనీ 28,000 యూనిట్లను విక్రయించిందని, ప్రస్తుత సంవత్సరానికి గానూ 50,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని, 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి ఒక లక్ష మార్కును తాకాలని భావిస్తున్నట్లు కంపెనీ ఉపాధ్యక్షుడు (నిర్వహణ) ఆశిష్ ధార్ తెలిపారు.

కోల్‌కటాలో మరో రెండు డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సందర్భంగా ధార్ మాట్లాడుతూ.. భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఏటా 20 శాతం వృద్ధిని సాధిస్తుందని తెలిపారు. భారత్‌లో మొత్తం ప్రీ-ఓన్డ్ కార్ల మార్కెట్ పరిమాణం 3.1 లక్షలుగా ఉండే మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ 10 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాప్ 20 నగరాలు తమకు అతిపెద్ద మార్కెట్లని, గ్రామీణ మార్కెట్ల పరిమాణం కూడా నెమ్మదిగా పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 136 డీలర్‌షిప్ కేంద్రాలను కలిగి ఉందని, 2014 నాటికి వీటిని 300 పెంచనున్నామని ధార్ పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 7, 2011, 11:04 [IST]
English summary
Mahindra & Mahindra's multi-branded pre-owned car company Mahindra First Choice Wheels has set a target of selling one lakh units by financial year 2013-14, a company official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+