సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు అనువైన కంపెనీ

మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్‌కు దక్షిణాదిలో చెన్నై తర్వాత ఇది రెండవ అతిపెద్ద స్టోర్. ప్రస్తుతం మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ ఐదు స్వంత ఔట్‌లెట్లను నిర్వహిస్తుంది. గడచిన సంవత్సరంలో తాము 28,000 కార్లను విక్రయించామని, ఈ సంవత్సరంలో సుమారు 40,000 కార్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని దూబే చెప్పారు.
టాటా నానో నుంచి బిఎమ్‌డబ్ల్యూ వరకూ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు/అమ్మకం చేస్తామని, సెకండ్ హ్యాండ్ కార్లలో కూడా డీజిల్ కార్లకే మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని సూపర్ స్టోర్‌లను ఏర్పాటు చేయనున్నామని, తమ సూపర్ స్టోర్లలో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు, అమ్మకం, కార్ల కొనుగోలుకు కావల్సిన రుణ సదుపాయం, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, యాక్ససరీస్ వంటి అన్ని సదుపాయలను మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్‌లో పొందవచ్చు.


Click it and Unblock the Notifications








