రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా జినియో డిసి

Mahindra Genio DC
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే దేశీయ విపణిలో ఆవిష్కరించిన ప్రీమియం డబుల్ క్యాబిన్ పికప్ వాహనం "జినియో" అప్పుడే రాష్ట్ర మార్కెట్లోకి కూడా అడుగు పెట్టేసింది. మౌళిక మరియు నిర్మాణ రంగాల్లో పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు మరియు పరికరాల కరవాణాకు వీలుగా రూపొందించిన ఈ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్ 'జినియో'ను బుధవారం హైదరబాద్‌లో కంపెనీ విడుదల చేసింది.

మహీంద్రా జినియో డిసి 75 హెచ్‌పి సామర్థ్యం కలిగిన ఎమ్‌డిఐ సిఆర్‌డిఈ ఇంజిన్‌తో గరిష్టంగా గంటకు 120 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో డ్రైవర్‌తో పాటు మరో నలుగురు ప్రయాణించే వీలుంటుంది. వెనుక భాగంలో ఉండే ట్రాలీలో 1,100 కేజీ పేలోడ్‌ను తీసుకెళ్లవచ్చు. మహీంద్రా జినియో డిసి రెండు వేరియంట్లలో లభిస్తుంది. హై-ఎండ్ వేరియంట్ జినియో డిసి పికప్‌లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి సదుపాయాలుంటాయి.

రాష్ట్ర మార్కెట్లో జినియో డబుల్ క్యాబిన్ పికప్ బేస్ వెర్షన్‌ ధర రూ. 5.51 లక్షలు మరియు హైఎండ్ వెర్షన్‌ ధర రూ.6.01 లక్షలుగా నిర్ణయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా జనరల్ మేనేజర్ (మార్కెటింగ్-ఆటోమోటివ్ డివిజన్) మహేష్ కులకర్ణి తెలిపారు. ఇది లీటర్ డీజిల్‌కు 13 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుందని ఆయన తెలిపారు. మహీంద్రా ఇప్పటికే 'జినియో' ఫ్లాట్‌ఫామ్‌పై సింగిల్ క్యాబిన్ పికప్ ట్రక్‌ను మరియు డబుల్ క్యాబిన్ బొలెరో పికప్ ట్రక్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 10:40 [IST]
English summary
India's leading utility vehicle maker Mahindra and Mahindra launched a two cabin pick up called 'Genio' on Wednesday In Hyderabad to meet the needs of infrastructure and construction space, where they are required to travel with their team and machinery.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+