దక్షిణాఫ్రికాలోనూ దూసుకుపోతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500

దక్షిణాఫ్రికాలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు 200 యూనిట్ల బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అదే భారత మార్కెట్లో ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు ఇప్పటికే 8,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చి పడ్డాయి. సెప్టెంబర్ 29న ఎమ్ అండ్ ఎమ్ ఈ ఎస్‌యూవీను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో దీని వెయింటిగ్ పీరియడ్ మూడు నెలలు, అంతకు మించి ఉంది.
అయితే, సౌత్ ఆఫ్రికాలో తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు మంచి స్పందన లభిస్తోందని, అక్కడి డీలర్ల నుండి 200 యూనిట్లకు ఆర్డర్లు లభించాయని ఎమ్ అండ్ ఎమ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్) ప్రవీన్ షా తెలిపారు. ప్రస్తుతం ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీను ఎమ్ అండ్ ఎమ్ సిబియూ రూట్లో దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేస్తుంది.
అక్కడి మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ధర 2,39,900 జార్ (సౌత్ ఆఫ్రికా కరెన్సీ) నుండి 2,94,900 జార్‌లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.79 లక్షల నుండి రూ.18.18 లక్షలు అన్నమాట. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు దేశీయ మార్కెట్ నుండి భారీగా ఆర్డర్లు వస్తుండటంతో కంపెనీ వీటి బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.


Click it and Unblock the Notifications








