సన్ డాన్స్ ఇన్స్టిట్యూట్‌తో చేతులు కలిపిన మహీంద్రా & మహీంద్రా

ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా రంగానికి మద్దతు ఇవ్వడానికి ఇరు సంస్థలు ఓ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్ అండ్ ఎమ్ వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. భారత సినిమా రంగంలో ఉన్న యువతర ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని, తమ ఆశయాల సాధనకు సన్‌డాన్స్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.
ఈ రెండు సంస్థల కలయిక ద్వారా దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో "ముంబై మంత్ర సన్‌డాన్స్ ఇన్స్టిట్యూట్ స్రీన్‌రైటర్స్ ల్యాబ్" అనే కేంద్రం ఏర్పడనుంది. ఇది ప్రతి ఏటా భారత్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications








