మహీంద్రా నుంచి వెరిటోలో రెండు కొత్త వేరియంట్లు మరొక ఎస్‌యూవీ

ప్రస్తుతం అందిస్తున్న వెరిటోను రిఫ్రెష్ చేసి మరిన్ని అదనపు హంగులను జోడించి ఒక వెరిటోను తీర్చిదిద్దనున్నామని, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెరిటో కన్నా చిన్నదిగా (పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా) ఓ కాంపాక్ట్ సెడాన్ వేరియంట్ వెరిటోను కూడా విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. ఇంకా.. మహీంద్రా ఓ గ్లోబల్ ఎస్‌యూవీను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా మహీంద్రాకు ఉన్న నెట్‌వర్క్‌లలో ఈ గ్లోబల్ ఎస్‌యూవీ లభ్యం అయ్యేలా కంపెనీ చర్యలు తీసుకోనుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల స్వాధీనం చేసుకున్న కొరియన్ కంపెనీ శాంగ్‌యాంగ్ ఎస్‌యూవీల ఉత్పత్తికి పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో మహీంద్రా అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీని ఈ కొరియన్ కంపెనీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది.
మహీంద్రా రీనాల్ట్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఉన్నప్పుడు రూపొందించిన సెడాన్ మోడల్ కారు "లోగాన్"లో మహీంద్రా మార్పులు చేర్పులు చేసిన "వెరిటో"గా పేరుమార్చి మార్కెట్లోకి విడుదల చేసింది. పేరుతో పాటు రూపురేఖలు కూడా మారిన వెరిటోకు మార్కెట్ నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఈ మోడల్‌లో మరిన్ని వేరియంట్లను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








