వెరిటో సెడాన్‌లో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసిన మహీంద్రా

Mahindra Verito Executive Edition
ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న వెరిటో (గతంలో లోగాన్) సెడాన్‌లో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. 'ఎగ్జిక్యూటివ్ ఎడిషన్' పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ కొత్త వెరిటో 1.5 లీటర్ డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఐదుగురు ప్రయాణీకులు హాయిగా ప్రయాణించేలా రూపొందించిన కొత్త వెరిటో సరికొత్త లుక్‌ను, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ సెడాన్‌ అదనంగా రెండు కొత్త రంగుల (పెరల్ వైట్, వాల్‌నట్ గోల్డ్)లో లభిస్తుంది. ఇంకా ఇందులో బ్లూ విజన్ హెడ్‌ల్యాంప్స్, యూఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన సరికొత్త స్టీరియో మ్యూజిక్ సిస్టమ్, లెథర్ ఇంటీరియర్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఎన్నో విశిష్టమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. మహీంద్రా వెరిటో ఎగ్జిక్యూటివ్ సెడాన్ ధర రూ. 7.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2011, 8:42 [IST]
English summary
Indian auto major Mahindra and Mahindra launches a special edition of the Verito sedan named as the Executive Edition, with a price tag of Rs 7.09 Lakhs ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+