ప్రపంచ మార్కెట్లోకి మహీంద్రా జెనియో పికప్ ట్రక్

Mahindra Genio
ప్రముఖ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవల విడుదల విడుదల చేసిన పికప్ ట్రక్ జెనియో అప్పుడే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. మహీంద్రా జెనియో క్యాబ్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సింగిల్ క్యాబ్ మరియు డబుల్ క్యాబ్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ప్రస్తుతం ఎమ్ అండ్ ఎమ్ ఆఫ్రికా, ఆసియా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

త్వరలోనే లాటిన్ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లో ఇది తమకు తొలి గ్లోబల్ లాంచ్ అని, మహీంద్రాలో ప్రతి ఒక్కరూ గర్వించదగిన క్షణమని మహీంద్రా అండ్ మహీంద్రా అద్యక్షుడు పవన్ గోయెంకా జెనియో విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు. గ్లోబల్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెనియో పికప్ ట్రక్ చాకన్‌లోని ప్లాంటులో తయారవుతుంది.

చిన్న మరియు మద్య తరహా వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని పికప్ ట్రక్‌ను రూపొందించారు. ఇందులో శక్తివంతమైన ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించడం వలన ఇది ఎక్కువ బరువును లాగేందుకు సహకరిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 120 bhp @ 4000 rpm మరియు 290 Nm @ 1600-2800rpmల టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 12, 2011, 15:10 [IST]
English summary
Mahindra and Mahindra has launched the Genio pick-up on the global stage. The Genio pick-up will now be available in the international market with both single cab and dual cab configurations. Mahindra and Mahindra currently exports its models to African and Asian countries. It also plans to enter the Latin American market shortly.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+