రాష్ట్ర మార్కెట్లో జినియో పిక్-అప్‌ను విడుదల చేసిన మహీంద్రా

మహీంద్రా జినియోలో ఏర్పాటు చేసిన ఇంజన్, గేర్ సిస్టమ్‌లు సాధారణ కార్ల మాదిరిగానే సౌకర్యంగా ఉంటాయని దీనికి అదనంగా ఎయిర్ కండిషన్, ఫాగ్‌లాంప్స్ తదితర సదుపాయాలను అమర్చుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినెలా 150 జినియోలను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. ప్రమ్తతం తమ సంస్థ పికప్ సెగ్మెంట్‌లో 90 శాతం మార్కెట్ వాటాను కలిగివుందని, సమీప భవిష్యత్‌లో ప్రతి రెండు మూడు నెలలకూ ఒక కొత్త వాహనాన్ని విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన తెలిపారు. డైమండ్ వైట్, మార్వెల్ గ్రానైట్, సిల్వర్ షైన్ (మెటాలిక్), స్కైలైన్ బ్లూ అనే నాలుగు రంగులలో జినియో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








