జనవరిలో 3 శాతం ధరలు పెంచనున్న ఎమ్ అండ్ ఎమ్

జనవరిలో ధరలు పెంచనున్న ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా చేరిపోయింది. రూపాయి మారకపు విలువ క్షీణిస్తుందు వలన అన్ని ఉత్పత్తులను ధరలను జనవరిలో సవరించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గడచిన సెప్టెంబర్ నెలలో కేవలం రూ.10.80 లక్షల ప్రారంభ ధరకే ఎమ్ అండ్ ఎమ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మూడు వేరియంట్లలో లభ్యమయ్యే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
9 ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








