అన్ని వాహనాల ధరలను 2% మేర పెంచిన ఎమ్ అండ్ ఎమ్

భవిష్యత్తులో ముడి సరుకుల ధరలు దిగిరాగలవలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఏడాది మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇది మూడోసారి. తొలుత ఏడాది జనవరి నెలలో 1.5 శాతం ధరలను పెంచగా, ఏప్రిల్ నెలలో కూడా ఇదే వంకతోనే ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచింది.
జులై, ఆగస్టు నెలల్లో అన్ని అగ్రాగమి ఆటో కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటిస్తే, ఎమ్ అండ్ ఎమ్ మాత్రం ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసుకుంది. జులై, ఆగస్టు నెలలు తమకు బాగా కలిసొచ్చాయని అలాగే, పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో అమ్మకాలు జోరందుకోగలవని భావిస్తున్నామని నాయర్ చెప్పారు.


Click it and Unblock the Notifications








