సిస్కోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మహీంద్రా & మహీంద్రా

ఈ ఒప్పందంలో భాగంగా సిస్కో ప్రోడక్ట్స్ మరియు సేవలను అందించగా.. మహీంద్రా అండ్ మహీంద్రా మరియు దాని అనుబంధ సంస్థలు వాటిని మార్కెటింగ్ చేయనున్నాయి. అంతే కాకుండా.. ఈ విభాగాల్లో అప్లికేషన్లు, సొల్యూషన్లను కూడా డెవలప్ చేయగల సమార్థ్యాలను కంపెనీ సంతరించుకోనుంది. ఈ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌కు ఇరు కంపెనీలు 10 కోట్ల రూపాయలను పెట్టుబడిగా వెచ్చించనున్నారు.
ఇప్పటికే మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ అయిన మహీంద్రా సత్యంతో సిస్కోకు పలు ఒప్పందాలు ఉన్నాయి. ఈ తాజా ఒప్పందంతో ఇరు సంస్థల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కాగలవని మహీంద్రా భావిస్తోంది. ఈ ఇరు సంస్థల భాగస్వామ్యం తొలుత "మహీంద్రా ఇన్నోవేషన్ పార్క్" అనే ఓ టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా.. మహీంద్రా & మహీంద్రా కోసం ఓ విర్చువల్ డీలర్‌షిప్‌ను కూడా మరో నాలుగైదు నెలల్లో ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications








