యువరాజ్ 215 ట్రాక్టర్‌ను విడుదల చేసిన ఎమ్ అండ్ ఎమ్

గుజరాత్‌లో ఈ ట్రాక్టర్‌కు మంచి ఆదరణ లభించిందని, మహారాష్ట్ర రైతుల నుంచి కూడా అదే స్పందన లభించగలదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా.. యువరాజ్ 215 ట్రాక్టర్ 15హెచ్‌పి శక్తిని కలిగి ఉండి, గంటకు 25.6 కిలో మీటర్ల గరిష్ట వేగంతో 1.5 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది. ఈ ట్రాక్టర్‌ను రాజ్‌కోట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ సాలీనా 16,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా విజన్‌లో యువరాజ్ ఓ కీలక భాగమని, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి సారించిందని ఎమ్ అండ్ ఎమ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, మార్కెటింగ్ అప్లిట్రాక్ (ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్) సంజీవ్ గోయల్ తెలిపారు.


Click it and Unblock the Notifications