ఎమ్ అండ్ ఎమ్ నిరుత్సాహకర ఫలితాలు; షేర్లు ఢమాల్..!

M and M Share Down
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాకు కూడా ఈ పండుగ సీజన్ పెద్దగా కలిసిరాలేదు. గడచిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం 3.18 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.761.5 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సయమానికి మహీంద్రా అండ్ మహీంద్రా నికర లాభం రూ.738 కోట్లుగా ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ మహీంద్రా వెహికల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ లిమిటెడ్‌ (ఎమ్‌విఎమ్ఎల్‌) లాభాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాండ్‌ఎలోన్ ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం 3 శాతం క్షీణించి రూ.737.4 కోట్లుగా నమోదైంది. ఈ నిరుత్సాహకర ఫలితాల కారణంగా సోమవారం స్టాక్ ఎక్సేంజ్‌లో కంపనీ షేర్లు ఏకంగా 7 శాతానికి పడిపోయాయి.

కాగా.. జులై-సెప్టెంబర్ 2011 త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 33.86 శాతం వృద్ధిని సాధించి రూ.8,299 కోట్లుగా ఉండగా, గడచిన సంవత్సరంలో ఇది రూ.6,200 కోట్లుగా నమోదైంది. ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగినప్పటికీ తాము లాభాలను నమోదు చేసుకున్నామని కంపెనీ పేర్కొంది. ఈ త్రైమాసికంలో ప్యాసింజర్, యుటిలిటీ వాహనాల అమ్మకాలు 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 47,523 యూనిట్లు అమ్మడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 15, 2011, 9:52 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M and M) posted The Profit after tax for the current Q2 is Rs 761.5 crore as against Rs 738.0 crores in Q2 last year. In the current quarter, M&M Ltd. suffered a net loss of Rs 32.0 crore on account of the precipitous fall in the value of the Rupee against the US dollar towards end of the quarter and the consequent revaluation of its External Commercial Borrowings repayable largely in the year 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+