మహీంద్రా అండ్ మహీంద్రా క్యూ4 నికర లాభంలో 6.5 శాతం వృద్ధి

Mahindra & Mahindra
దేశపు అతిపెద్ద యుటిలివీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, మార్చి 31, 2011తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ చివరి త్రైమాసికపు ఫలితాలను వెల్లడించింది. 2010-11 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 6.3 శాతం వృద్ధి చెంది రూ. 606 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2009-10)లో ఇదే సమయానికి నికర లాభం రూ. 570 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అలాగే.. మార్చి 31, 2011తో ముగిసిన 2010-11 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ మొత్తం నికర లాభం అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2009-10)తో పోలిస్తే 27.5 శాతం పెరిగి రూ. 2,087.8 కోట్ల నుంచి రూ. 2,662.1 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

మరోవైపు 2010-11 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల ఆదాయం కూడా 200-10 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25.7 శాతం వృద్ధి చెంది రూ. 20,595.5 కోట్ల నుంచి రూ. 25,896 కోట్లకు చేరుకుంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో దేశీయ మార్కెట్లో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అధ్యక్షుడు పవన్ గోయెంకా వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2011, 17:48 [IST]
English summary
Country's largest utility vehicles maker Mahindra & Mahindra, reported a 6.3% rise in net profit for the quarter ended March 31, 2011, at Rs 606 crore ($134 million) as compared to Rs 570 crore in the corresponding quarter last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+