వెరిటో ఎఫెక్ట్: మహీంద్రా మే నెల విక్రయాలలో 20 శాతం వృద్ధి

మే 2011లో ప్యాసింజర్ వాహన విభాగంలో (యుటిలిటీ వాహనాలతో పాటు కొత్తగా విడుదల చేసిన వెరిటోతో కలిపి) 20 శాతం వృద్ధిని సాధించి 16,702 యూనిట్లను విక్రయించింది. మే 2010లో ఇవి కేవలం 13,939 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వెరిటోగా పేరు మార్చి కొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసిన లోగాన్ కారు భారీ స్పంధన లభించింది. గతేడాది మే నెలలో కేవలం 450 లోగాన్ కార్లు మాత్రమే అమ్ముడైతే, ఈ ఏడాది మే నెలలో వెరిటో 185 శాతం వృద్ధిని సాధించి 1,291 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే మే నెలలో మగీంద్రా ఎగుమతులు కూడా 1,068 యూనిట్ల నుంచి 2,164 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








