ల్యాండ్ మైన్‌లను సైతం తట్టుకునే వాహనం

ఎమ్ అండ్ ఎమ్, బిఏఈ సిస్టమ్స్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ ఇండియా ద్వారా డిజైన్, తయారీ చేయబడిన తొలి ఉత్పత్తి "మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్ ఇండియా" (ఎమ్‌పివిఐ). జార్ఖండ్ వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మందుపాతరల కారణంగా వందలాది మంది పోలీసులు, పారామిలటరీ బలగాలు ప్రాణాలను కోల్పోతున్న నేపథ్యంలో వారి రక్షణార్థం ఈ వాహనాన్ని తయారు చేశారు.
ల్యాండ్‌మైన్ల పేలుడును సైతం తట్టుకునే విధంగా, యాంటీ-టెర్రరిస్ట్ మరియు యాంటీ-నక్సలిజం ఆపరేషన్ల కోసం దీన్ని రూపొందించారు. అంతేకాదు, అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలతోనూ, బుల్లెట్లతోనూ ఫైరింగ్ జరిపి ఈ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించడం కూడా జరిగింది. 6-వీల్ (6x6) డ్రైవింగ్ ఆప్షన్‌తో 230 హెచ్‌పిల శక్తి కలిగిన పవర్‌ఫుల్ ఇంజన్‌తో దీన్ని రూపొందించారు. ఈ వాహనంలో 18 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








