మహీంద్రా నావిస్టార్ నుంచి రూ.250 కోట్ల పెట్టుబడులు

Mahindra Navistar
భారతదేశపు ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) మరియు అమెరికాకు చెందిన ప్రముఖ ట్రక్కుల తయారీ సంస్థ నావిస్టార్‌ల జాయింట్ వెంచర్ 'మహీంద్రా నావిస్టార్' భారత్‌లో మరిన్ని పెట్టుబడులను పెట్టనుంది. వాణిజ్య వాహనాల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను వేగవంతం చేసేందుకు గానూ చాకన్ ప్రాజెక్ట్‌లో మరో రూ.250 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మొత్తం వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుపై తాము ఇప్పటికే రూ.750 కోట్లను వెచ్చించామని, మరో రెండేళ్లలో రూ.250 కోట్లను వెచ్చించి వాణిజ్య వాహనాల ఉత్పత్తి, పంపిణీ నెట్‌వర్క్‌లను విస్తృతం చేస్తామని మహీంద్రా నావిస్టార్ డైరెక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, మహీంద్రా నావిస్టార్ భారత్‌లో రూపొందిస్తున్న కుడిచేతి-వాటం డ్రైవింగ్ (రైట్-హ్యాండ్ డ్రైవింగ్) సిస్టమ్ కలిగిన వాణిజ్య వాహనాలను దక్షిణాఫ్రికా మరియు సార్క్ (SAARC) దేశాలకు ఎగుమతి చేయడానికి వ్యూహరచనలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 7, 2011, 16:46 [IST]
English summary
Country's leading utility vehicles maker Mahindra & Mahindra and US-based Navistar's joint venture Mahindra Navistar Automotive Ltd, is planing to invest Rs. 250 crore in Chakan project to speed up manufacturing and distribution of commercial vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+