జియో ప్యాసింజర్ క్యాబ్‌ను విడుదల చేసిన మహీంద్రా

మహీంద్రా అందిస్తున్న జియో బ్రాండ్‌లో ప్యాసింజర్ వేరియంట్‌ను బీహార్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ విభాగంలో ఇప్పటికే బజాజ్, పియాగ్గియో, టాటా వంటి కంపెనీలు అందిస్తున్న ప్యాసింజర్ వాహనాలకు ఇది గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. నాలుగు చక్రాలు కలిగిన ఈ ప్యాసింజర్ క్యాబ్ 441.5 సీసీ, సింగిల్ సిలిండర్ డైరెక్ట్ ఇంజక్షన్ డీజిల్ ఇంజన్‌తో ఇది లీటరు డీజిల్‌కు 30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇక దీని సాంకేతిక వివరాల విషయానికి వస్తే...
ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, డైరెక్ట్ ఇంజక్షన్
ఇంజన్ సీసీ - 441.5 cc
బోర్ x స్ట్రోక్ - 86 mm x 76 mm
కంప్రెషర్ నిష్పత్తి - 20.3 : 1
గరిష్ట పవర్ - 6.8 ± 0.3 kW @ 3600 rpm
గరిష్ట టార్క్ - 21 ± 1 Nm @ 2000 - 2400 rpm
క్లచ్ టైప్ - మల్టీ ప్లేట్ వెట్ టైప్ క్లచ్
ట్రాన్సిమిషన్ (గేర్) టైప్ - మ్యాన్యువల్
ట్రాన్సిమిషన్ - ఐదు గేర్లు (4 ముందుకు, 1 రివర్స్)
ముందు సస్పెన్షన్ - ఇండిపెండెంట్ మెక్-ఫెర్సన్ విత్ బ్యాండెడ్ పిస్టన్
వెనుక సస్పెన్షన్ - లీఫ్ స్ప్రింగ్ విత్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్వర్
ముందు బ్రేక్ - హైడ్రాలిక్ డ్రమ్
వెనుక బ్రేక్ - హైడ్రాలిక్ డ్రమ్
ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)


Click it and Unblock the Notifications








