నానో బాటలో మహీంద్రా.. చౌక ఎస్‌యూవీకి సన్నాహాలు

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే కొనుగోలుచేసిన కొరియన్ కంపెనీ శాంగ్‌యాంగ్‌తో కలిసి ఈ మినీ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తుంది. ఎస్101 కోడ్‌నేమ్‌తో రూపొందుకున్న ఈ ఎస్‌యూవీపై ఎక్సైజ్ రాయితీని పొందేందుకు గానూ కంపెనీ దీని పొడవును 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేయనుంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.4 లక్షల నుండి రూ.6 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
అయితే, మరికొందరి అంచనా ప్రకారం ఈ మినీ-ఎస్‌యూవీ ధర కేవలం రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల మద్యనే ఉండొచ్చని సమాచారం. ఇదే గనుక నిజమై, ఇంత తక్కువ ధరకే ఓ ఎస్‌యూవీ లభించినట్లయితే, టాటా నానో కారు మాదిరిగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా భారత ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ సంచలనం సృష్టించడం ఖాయం.
ప్రస్తుతం ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న చీప్ ఎస్‌యూవీ మహీంద్రా బొలెరో. దీని ధర రూ.6 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. అయితే, ఇప్పటికే ప్రిమీయర్ కంపెనీ కేవలం రూ.4.9 లక్షల ధరకే ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ రియో (పెట్రోల్ వెర్షన్)ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న ఎమ్‌యూవీ జైలో మోడల్‌లో కూడా ఓ మినీ వేరియంట్‌ను అందిచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








