మరో ఆరు నెలల్లో ఎన్ఎక్స్ఆర్‌ను విడుదల చేయనున్న రేవా

"ఇదొక ఫోర్-సీటర్ కారు. సరైన స్పేస్, పవర్ మరియు ఇతర ఫీచర్లు ఉండేలా దీన్ని మేము అభివృద్ధి చేశామ"ని ఆయన చెప్పారు. అయితే, దీనికి సంబంధించిన ధర, ఇతర వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వీటి ధర కాస్తంత అధికంగానే ఉంటుందని, అయితే సమర్థవంతమైన ధరకే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రేవాను గతేడాదిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకుంది. మహీంద్రా-రేవాల నుంచి వస్తున్న తొలి మోడల్ 'ఎన్ఎక్స్ఆర్' కావడం విశేషం. ఈ కారుకు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే పూర్తిగా చార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఇది గంటకు గరిష్టంగా 104 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications








