మహీంద్రా ఎలక్ట్రిక్ కారు 'రేవా ఐ': ప్రత్యేకతలు-విశిష్టతలు

Mahindra REVAi
ఇంధన ధరలు భగ్గున మండిపోతున్న ఈ రోజుల్లో అస్సలు పెట్రోల్ అవసరమే లేకుండా నడిచే కార్లు లభిస్తే.. ఇక వినియోగదారుల సంతోషానికి అవుధులు ఉండవు కదా..! ఇలాంటి కారునే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ రూపొందించింది. మరి పెట్రోల్ లేకుండా కారు ఎలా నడుస్తుందనే కదా అనుమానం..! ఇది పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది. ఈ కారులో ఉన్న బ్యాటరీని ఒక్కసారి ఫుల్లుగా చార్జి చేస్తే.. 80 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఈ కారులో ఒక ఫ్యామిలీ (ఇద్దరు పెద్దవాళ్లు + ఇద్దరు పిల్లలు) హాయిగా ప్రయాణించ్చు. పైగా దీని పరిమాణం కూడా మిగతా కార్లతో పోలిస్తే చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్‌, పార్కింగ్ సమస్యలను సునాయసంగా అధిగమించవచ్చు. మరి దీని పూర్తి వివరాలు తెలుసుకుందామా..!!

Standard Specifications
ఇది రెండు డోర్లు మాత్రమే ఉండే హ్యాచ్‌బ్యాక్ కారు
పూర్తిగా ఆటోమేటిక్: ఈ కారులో గేర్లు, క్లచ్‌ ఉండవు.
ట్యూబ్‌లేని టైర్లు: బ్యాటరీ పవర్ ఖర్చు కాకుండా ఉండేందు కోసం ఈ కారుకు ట్యూబు లేని టైర్లను ఉపయోగిస్తారు.
ప్రయాణించే దూరం: బ్యాటరీని ఒక్కసారి ఫుల్లుగా చార్జి చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించ వచ్చు. ఇది ఏడు సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
చైల్డ్ సీట్ బెల్ట్, తక్కువ పార్కింగ్ ప్లేసులో ఇమిడిపోవడం, విశాలమైన డోర్లు, అవసరం లేకపోతే మడుచుకోవడానికి వీలుగా ఉండే సీట్లు దీని ఇతర ప్రత్యేకతలు.

Dimensions
పొడవు - 2639 మిమి
వెడల్పు - 1324 మిమి
ఎత్తు - 1510 మిమి
గ్రౌండ్ క్లియరెన్స్ - 150 మిమి
వీల్ బేస్ - 1710 మిమి
టర్నింగ్ రేడియస్ 3.5 మి
బరువు - 700 కేజీలు

Technical Specifications
టైప్: రెండు డోర్ల హ్యాచ్‌బ్యాక్
పేలోడ్: ఇద్దరు పెద్దలు & ఇద్దరు పిల్లలు (మొత్తం 227 కేజీలు)
గరిష్ట వేగం: గంటకు 80 కిలోమీటర్లు
బ్యాటరీ చార్జింగ్‌కు పట్టే సమయం: 2.5 గంటల్లో 80 శాతం చార్జింగ్, 8 గంటల్లో 100 శాతం చార్జింగ్
బ్యాటరీ: 48 వోల్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ
లభించే రంగులు: ఆరు (ఏంజిల్ వైట్, ఎన్వీ బ్లూ, చెర్రీ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, ప్యాషన్ యల్లో, సిల్వర్ యారో)
లభించే మోడల్స్: మూడు (రేవా ఐ స్టాండర్డ్, రేవా ఐ ఎసి, రేవా ఐ క్లాసే)
బ్రేక్స్: డిస్క్ బ్రేక్స్

రేవా ఐ కారును చార్జ్ చేసుకోవడం చాలా సులభం, ఓ సెల్‌పోన్ ఎలా చార్జ్ చేసుకుంటామో ఈ కారును కూడా అదేవిధంగా చార్జ్ చేస్తాం. ఈ కారును వాడకుండా అలా ఉంచేసినప్పటికీ బ్యాటరీ చార్జింగ్ పూర్తిగా అయిపోదు. ఇది రోజుకు కేవలం రెండు శాతం మాత్రమే బ్యాటరీ చార్జింగ్‌ను కోల్పోతుంది. అంతే కాదండోయ్ ఇది రోడ్డుపై ఎక్కడపడితే అక్కడి ఆగిపోదు. బ్యాటరీ చార్జింగ్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ బ్యాటరీ పవర్ తగ్గితే రెడ్‌బటన్ వెలిగి ఆటోమేటిగా కారులో ఎసి ఆగిపోయి పవర్‌ను సేవ్ చేస్తుంది.

రోజుకు 40 నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఇది చక్కగా సరిపోతుంది. ఇతర ఇంధన కార్ల మాదిరిగా ఇది శబ్ధ, వాయు కాలుష్యాలను కలిగించదు. ఇది పూర్తిగా పర్యావరణ ప్రియమైనది. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దీని ధర కూడా కొంచెం ప్రియంగానే ఉంటుంది. దీని ధర సుమారు రూ. 3,49,705 నుంచి రూ. 4,28,419 (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, February 4, 2011, 15:15 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+