స్కార్పియోలో చౌక ధర మోడల్‌ను ప్రవేశపెట్టిన మహీంద్రా

Mahindra Scorpio
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'స్కార్పియో' మోడల్‌లో కంపెనీ మరో కొత్త చౌక మోడల్‌ను ప్రవేశపెట్టింది. రూ. 7.21 లక్షల ధరకే అందుబాటులో ఉండేలా స్కార్పియో ఈఎక్స్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. గతంలో చౌక ధర స్కార్పియో అంటే రూ. 8.8 లక్షలుగా ఉండేది. భారత కార్ మార్కెట్లోని ఎస్‌యూవీ విభాగంలో వివిధ విదేశీ సంస్థలు ప్రవేశపెడుతున్న ఎస్‌యూవీల పోటీని తట్టుకునేందుకు కంపెనీ చౌక ధరకే స్కార్పియోను దేశీయ వినియోగదారులకు అందిచాలని భావిస్తోంది.

చెక్ రిపబ్లిక్‌ దేశానికి చెందిన 'స్కోడా' (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ) కూడా రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకే ఓ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింన కొద్ది రోజులకే హహీంద్రా స్కార్పియో ఈఎక్స్‌ మోడల్‌ను విడుదల చేయడం గమనార్హం. కాగా.. మాహీంద్రా స్కార్పియో ఈఎక్స్ మోడల్ వాహనం 2.5 లీటర్ ఎమ్2డిఐసిఆర్ (m2DiCR) ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 75 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తూ 11.2 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఏఆర్ఏఐ (ARAI) ప్రకారం స్కార్పియో ఈఎక్స్ లీటరుకు 14 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఇక ఇదే బ్రాండ్‌లో ఉన్న ఇతర మోడళ్లు 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తాయి.

అలాగే.. మహీంద్రా స్కార్పియో ఈఎక్స్ అత్యాధునిక మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించబడినది. ఈ టెక్నాలజీ వల్ల వాహన ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా ఈ కారు దొంగల బారిన పడకుండా ఉండేలా డిజిటల్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్‌తో లభిస్తుంది. అధిక మైలేజ్ ఇచ్చేందుకు గానూ స్కార్పియో ఈఎక్స్ ఇంజన్‌ను తక్కువ పవర్ ఉండేలా తీర్చిదిద్దారు. ఇది రాకీ బీగి, డైమండ్ వైట్, ఫెయిరీ బ్లాక్, మిస్ట్ సిల్వర్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇక దీని ఎక్స్-షోరూమ్ పూణే ధర రూ. 7.21 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 25, 2011, 15:52 [IST]
English summary
Country's leading utility vehicle maker Mahindra & Mahindra launched a low priced version of its flagship SUV Mahindra Scorpio. The all new Mahindra Scorpio EX priced at Rs. 7.21 Lakhs (Ex-showroom Pune) is powered by a 2.5 Litre m2DiCR engine with a max power of 75 BHP and a max torque of 220 Nm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+